నమస్కారమండీ... ఈ రోజు జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనిపించి కంప్యూటర్ ఆన్ చేసి రాయడం ప్రారంభించాను.. ఈరోజు ఉదయాన్నే మా కేబుల్ టివి రిజిస్ట్రేషన్ కోసం నల్గొండ పోస్టాఫీసు కు వెళ్ళాను పొద్దునే పోస్టాఫీసు ఓపెన్ చేయగానే పోస్టుమాస్టర్ గారిని కలిసి ఎంత ఖర్చవుతుంది, ఎలా చేయాలి, ఎంత టైం పడుతుంది అని అడగ్గానే ఆయన నన్ను కందకి పైకి ఒకసారి చూసి నువ్వు డీలర్ అని ఏమిటి ఆధారం అన్నాడు ఇప్పుడు అంతా ఆన్ లైన్ అయ్యింది కదా డబ్బు ట్రాన్సఫర్ చేసిన రిసీట్ ఉందని చెప్పాను అప్పుడు మూడు సెట్లు జిరాక్స్ తీసుకురమ్మని మూడు పత్రాలు ఇచ్చాడు. అవి తెచ్చేలోపే ఆయన ఎక్కడికో వెళ్ళాడు అప్పుడు సమయం 11am అప్పటి నుండి 3pm వరకు నల్ల ధనం రూపుమాపడం లాంటి గొప్ప మహాకార్యం కోసం ATM ముందు ఎదురుచూసినట్టు ఎదురుచూశాను అప్పుడు వచ్చి పిలిచాడు దేశమరసిన ధీరపురుషుని వలె, వరద బాధితునికి పులిహోర పొట్లం దొరికినట్టు సంతోషపడుతూ వినమ్రతతో ఆ ప్రభుత్వోద్యోగి ముందు నిలబడ్డాను. 500 రూపాయలు డి.డి కట్టి రమ్మన్నాడు అప్పటికే పోస్టాఫీసు టైం ఐపోయింది ఇప్పుడెలా సారూ అంటే తన పలుకుబడి తో డి.డి కట్టించుకొని ఒక సంతకం పెట్టి ఒక సీల్ వేసాడు దానికి ఆయన తల దించుకొని ఎవ్వరికి వినపడకుండా 100 రూపాయలు లంచం ఇవ్వమన్నాడు. నాకు నవ్వొచ్చింది ఆ ప్రభుత్వోద్యోగి జీతం నెలకు 50,000 రూపాయలు. ఐదు అక్షరాల సంతకం(ESWAR) పెట్టడానికే 5 గంటలు నిల్చోబెట్టి 100 రూపాయల లంచం అడిగాడు అంటే ఇంకా నయం నాలాగ 10 అక్షరాలు ఉంటే...!!!
ఇంతకీ నన్ను బాధపెట్టే విషయం ఏమిటంటే సెంట్రల్ గవెర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి 7Th pay commission అమలులోకి వచ్చినా కూడా వీళ్ళకి జీతాలు సరిపోక 100 రూపాయలకి కక్కుర్తి పడుతున్నారంటే ప్రభుత్వోద్యోగుల దీన పరిస్థితి కళ్ళకు కడుతుంది
దేశానికి కడుపు నిండా అన్నం పెట్టే రైతుకు తెలియదు లంచం అంటే
ఓనమాలు నేర్పించి విజ్ఞానాన్ని అందించి జీవితానికి వెలుగునిచ్చే ఉపాధ్యాయునికి తెలియదు లంచం అంటే
చెమటోడ్చి రోజంతా ఎండలో కష్టపడినా 300 రూపాయలు రాని రోజువారీ కూలీకి తెలియదు లంచం అంటే
కానీ అత్యధికంగా జీతాలు పొందే ఈ ప్రభుత్వోద్యోగులకు ఎందుకో.

No comments:
Post a Comment