Wednesday 31 January 2018

బ్లూమూన్ అంటే?!

బ్లూమూన్ [BLUE MOON] అంటే:

నమస్కారం మిత్రులారా!! మీరు బ్లూమూన్ గురించి వినే ఉంటారు. ఈ పదం ఈరోజు(31-01-2018) సాయంత్రం గం5:18ని||లకు పట్టనున్న చంద్ర గ్రహణానికి సంబంధించినది. నిన్నటి నుంచి వార్తాపత్రికల్లో మరియు సామాజిక మాధ్యమాల్లో బ్లూమూన్(BLUEMOON) అనే పదం విరివిగా కన్పిస్తోంది. చాలా మందికి బ్లూమూన్ అంటే ఏమిటో తెలుసని అనుకున్నాను కానీ ఈరోజు ఉదయం నాకు వాట్సాప్లో వచ్చిన వీడియో ఆధారంగా చాలా మందికి బ్లూమూన్ గురించి తప్పుడు అవగాహన ఉందని అర్థం అయింది అందుకే ఈ పోస్టు రాస్తున్నాను. బ్లూమూన్ అంటే చాలా మంది చంద్రుడు నీలి వర్ణంలో కన్పిస్తాడని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నిజం ఏమిటంటే ఏదైనా ఒక ఇంగ్లీషు నెలలో వచ్చే రెండవ పౌర్ణమి నాడు కన్పించే చంద్రున్ని బ్లూమూన్ అంటారు. అలాగే సూపర్ మూన్ అంటే చంద్రుని యొక్క భ్రమణ కాలంలో భూమికి దగ్గరగా వచ్చిన పౌర్ణమి చంద్రుడు అన్నమాట.
చివరిసారి ఎప్పుడు వచ్చింది:
మన ఆసియా ఖండంలో చివరగా ఈ బ్లూమూన్ మరియు సంపూర్ణ చంద్రగ్రహణం డిసెంబర్ 30 1982 లో వచ్చింది. అంటే దాదాపు 35 సంవత్సరాల తర్వాత ఈరోజు వస్తుందన్నమాట.

No comments: